



ఈరోజు వాంబే కాలనీలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఒన్ ఎర్త్ – ఒన్ లైఫ్” స్టాల్ ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది.
విజయవాడ *నగరపాలక సంస్థ (VMC) కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర హెచ్.ఎం. (IAS)* గారు మన స్టాల్‌ను సందర్శించి అభినందించడం ఆనందంగా ఉంది. అలాగే *“Farmer to Consumer”* కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించేందుకు ప్రోత్సహించడం మా కోసం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇతర అధికారులు, RR పేట సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా స్టాల్‌ను సందర్శించగా, మా ఔషధ మొక్కలు అందరినీ ఆకట్టుకున్నాయి.
*ఒన్ ఎర్త్ – ఒన్ లైఫ్* ఫౌండర్ & అడ్మిన్‌గా నేను మాట్లాడుతూ, మా సంస్థ ద్వారా మిద్దె తోటల ప్రోత్సాహం, దేశవాళీ విత్తనాల ఉచిత పంపిణీ, టెర్రస్ గార్డెనింగ్‌పై అవగాహన కల్పిస్తున్న విషయాలను పంచుకున్నాను. నగరంలో స్థలం కొరత ఉన్నప్పటికీ టెర్రస్‌పై సులభంగా మొక్కలు పెంచుకునే విధానాలను అందరికీ తెలియజేస్తున్నామని పేర్కొన్నాను.
మద్దిరాల కమలాకరరావు గారు మాట్లాడుతూ, OE-OL ద్వారా మిద్దె తోటలను ఎలా పెంచాలి, ఎలా సంరక్షించుకోవాలో నేర్చుకుని ఈ సంవత్సరం “రైతు నేస్తం అవార్డు” అందుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. అలాగే కిచెన్ వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చి మొక్కలకు ఉపయోగించడం ద్వారా నగరపాలక సంస్థపై భారాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు.
ఇటువంటి వేదికను కల్పించిన కమిషనర్ గారికి, నగరపాలక సంస్థ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన హారతి గారు, మాధవి గారికి, సురేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
*_లీలా కుమారి ఏలూరి_*
*ఫౌండర్ & అడ్మిన్*
*OE-OL*
Leave a comment