One Earth One Life

Farmer to Consumer, 01-March-2026

CategorIes:

By

·

1–2 minutes

*_🌿ONE EARTH – ONE LIFE (టెర్రస్ గార్డెన్ గ్రూప్) 🌿_*

మన గ్రూప్ ఆధ్వర్యంలో ఆదివారం 01-మార్చి-2026 న నిర్వహించిన *“Farmer to Consumer”* కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యింది అనే సంతోషాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది.

*“ఆరోగ్యకరమైన ఆహారం – ఆరోగ్యకరమైన జీవితం”* అనే మంచి ఆలోచనతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, రసాయన రహితంగా సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలు మరియు ఆకుకూరలను నేరుగా రైతుల నుంచి వినియోగదారులకు అందించగలిగాం. మధ్యవర్తులు లేకుండా రైతులకు న్యాయమైన ధర లభించగా, ప్రజలకు తాజా మరియు ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందాయి.

ప్రజల నుంచి విశేష స్పందన రావడం మా అందరికీ ఎంతో ఆనందాన్నిచ్చింది. ముఖ్యంగా ఉదయాన్నే వాకింగ్‌కు వచ్చే వారు, పరిసర ప్రాంతాల నివాసితులు, మన గ్రూప్ సభ్యులు ఆసక్తిగా సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రోత్సాహకరంగా ఉంది.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన నగరపాలక సంస్థ అధికారులు, రైతులు, వాలంటీర్లు మరియు ప్రతి ఒక్క సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏

ఇలాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ, విజయవాడను మరింత హరితమైన మరియు ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు మనందరం కలసి ముందుకు సాగుదాం. 💚🌱

ONE EARTH – ONE LIFE
*టెర్రస్ గార్డెన్ గ్రూప్*

Leave a comment