One Earth One Life

NTR District Organic Raitotsavam Vijayawada 22-Feb-2026

CategorIes:

By

·

1–2 minutes
https://youtu.be/9q05SshcRF0?si=3ekd0JhIR5NVk9y1

*_🌿🌾 ఎన్.టి.ఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం – నేచురల్ ఫార్మింగ్ మేళా 2026 🌾🌿_*

ఈరోజు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం లో నిర్వహించిన ఆర్గానిక్ రైతోత్సవం – నేచురల్ ఫార్మింగ్ మేళా 2026లో One Earth – One Life (Terrace Garden Group) టీమ్ భాగస్వామ్యం కావడం మా అందరికీ గర్వకారణం. 🌍💚

మిద్దె తోటల్లో సహజసిద్ధంగా పండించిన అరుదైన కూరగాయలు, దేశవాళీ సొరకాయల రకాలు, పచ్చని ఆకుకూరలు, ఔషధ మొక్కలు మరియు కూరగాయల మొక్కలను ప్రదర్శిస్తూ – “ఇంటి పైకప్పే చిన్న రైతుబడి” అనే సందేశాన్ని అందించగలిగాము. 🌱🥬🌿

మన OE-OL స్టాల్‌ను సందర్శించిన
గౌరవ కలెక్టర్ శ్రీ లక్ష్మీశ్ గారు, ఐఏఎస్, గౌరవ జాయింట్ కలెక్టర్ ఇలాకియా గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ గారు, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకరన్ గారు మరియు ఇతర ప్రముఖులు మా ప్రదర్శనను అభినందించడం – మన ప్రయత్నాలకు మరింత నమ్మకం, మరింత ఉత్తేజం ఇచ్చింది. 🙏

*🌿 “మిద్దె తోట – ప్రతి ఇంట్లో ఒక ఆరోగ్య విప్లవం” 🌿*

సహజ వ్యవసాయం అనేది కేవలం పద్ధతి కాదు… అది మన ఆరోగ్యానికి, మన కుటుంబ భవిష్యత్తుకి, మన భూమాతకు ఇచ్చే గౌరవం.

ఒక్క గింజ నాటితే… అది మొక్కగా పెరుగుతుంది;
ఒక్క ఆలోచన నాటితే… అది ఉద్యమంగా మారుతుంది. 🌱✨

మన మిద్దె తోటల సందేశం ప్రతి ఇంటికీ చేరాలని, ప్రతి ఇంటి పైకప్పు పచ్చగా మారాలని మన సంకల్పం.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకారం అందించిన అడ్మిన్ టీమ్‌కు, మన OE-OL వాలంటీర్ టీంకు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. కలిసి ముందుకు సాగుదాం… మరింత పచ్చదనం వైపు! 🌾💚

ధన్యవాదాలతో,
*_OE-OL ADMIN TEAM 🌿_*

https://www.facebook.com/share/1DgECoBVar/

Leave a comment