

🌿 ప్రకృతి వైద్యంతో ఆరోగ్యవంతమైన జీవితం – ప్రకృతి ఆరోగ్యం మహోత్సవం 🌿
నిన్న నిర్వహించిన ప్రకృతి ఆరోగ్యం మహోత్సవంలో ప్రఖ్యాత ప్రకృతి వైద్య నిపుణులు డా. రామచంద్ర రావు గారు ఆరోగ్య జీవన విధానంపై ఎంతో విలువైన మెలకువలను తెలియజేశారు. మనమే మన మిద్దె తోటలో పెంచుకున్న ఆకుకూరలను జ్యూస్‌గా తీసుకోవడం ద్వారా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు దూరమవుతాయని, అలాగే సహజమైన ఆహార పద్ధతులను అలవాటు చేసుకుంటే క్యాన్సర్, ఫైబ్రాయిడ్స్, లివర్‌కు సంబంధించిన వ్యాధులు వంటి అనేక సమస్యలను నివారించవచ్చని ఆయన తన అనుభవాలతో సులభమైన మాటల్లో వివరించారు. “మన ఇల్లే ఒక హాస్పిటల్, మన వంటగది ఔషధ శాల” అనే భావనను తన మాటల ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ, “ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది” అనే సందేశాన్ని తన జీవన విధానంతోనే నిరూపిస్తున్న డా. రామచంద్ర రావు గారు, ప్రస్తుతం సుమారు 3000 మంది సభ్యులతో ముందుకు సాగుతున్న One Earth – One Life (OE–OL) సంస్థ త్వరలో 3 లక్షల సభ్యులుగా విస్తరించాలని ఆకాంక్షిస్తూ, ప్రకృతి, ఆరోగ్యం, జీవన విలువలతో కూడిన ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములం కావాలని ఆహ్వానించారు. అలాగే OE–OL సభ్యుల కోసం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలియజేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఈ చక్కటి అవకాశాన్ని అందించిన లీలా కుమారి ఏలూరి గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం ఇన్‌చార్జ్ నాగోతి ప్రసాద్ గారు తనదైన శైలిలో ఆరోగ్యానికి సంబంధించిన చక్కటి సూచనలు తెలియజేసి కార్యక్రమానికి మరింత ప్రేరణనిచ్చారు. ఈ అర్థవంతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ మన OE–OL టీం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. 🌍💚
Leave a comment