One Earth One Life

13 December 2025 ప్రకృతి ఆరోగ్య మార్గదర్శి – డా. రామచంద్ర గారి కార్యక్రమం

CategorIes:

By

·

1–2 minutes

13 December 2025 ప్రకృతి ఆరోగ్య మార్గదర్శి – డా. రామచంద్ర గారి కార్యక్రమం

*_🌿ప్రకృతి ఆరోగ్య మార్గదర్శి – డా. రామచంద్ర గారు🌿_*
మన OE–OL కుటుంబం తరపున జరిగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రాబోతున్నారని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది.

ప్రకృతి వైద్యం, సహజ జీవనశైలి, ఆహార నియమాలు వంటి అంశాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ, వేలమందికి ఆరోగ్య మార్గం చూపిన వారు డాక్టర్ రామచంద్ర గారు.
హైదరాబాద్‌లో స్థాపించిన ప్రకృతి ఆశ్రమం ద్వారా అనేక రోగులకు ఉచిత సలహాలు, సహజ ఆహారం, ఆరోగ్య శిక్షణలు అందిస్తూ సేవ చేస్తున్నారు.

ఆహారమే ఔషధం, సహజ జీవనం – సహజ ఆరోగ్యం వంటి సందేశాలతో సోషల్ మీడియా ద్వారా లక్షలాది మందికి అవగాహన కల్పిస్తున్నారు. షుగర్, సోరియాసిస్, ఊబకాయం వంటి సమస్యలపై ఆయన సూచనలతో ఎంతోమంది మంచి ఫలితాలు పొందారు.

మన గ్రూప్ సభ్యులందరికీ ఎంతో ఉపయోగకరమైన ప్రకృతి ఆరోగ్య జ్ఞానాన్ని ఈ కార్యక్రమంలో పంచుకోనున్నారు.
ఇందుకు అందరూ తప్పకుండా హాజరై లాభపడాలని మనవి. 🌿✨

*_లీలా కుమారి ఏలూరి_*
*అడ్మిన్, OE-OL*

Leave a comment