08th Rose and Horticulture Show 05th to 08th December 2025
07 డిసెంబర్ 2025

07 డిసెంబర్ 2025: ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీశ గారు మన OEOL స్టాల్‌ను సందర్శించడం మా అందరికీ ఎంతో గౌరవకరమైన మరియు ఆనందదాయకమైన సందర్భం.
మన స్టాల్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ—
“మిద్దె తోటల ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం మీరు చేపడుతున్న కార్యక్రమాలు నిజంగా ఆదర్శనీయమైనవి. ఆర్గానిక్ విధానంలో పండించిన కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలు వంటి విభిన్నమైన మొక్కల పరిచయం ద్వారా OEOL ఎన్టీఆర్ జిల్లాకు ఒక ప్రత్యేకతను తీసుకువచ్చింది” అని ప్రశంసించారు.
అదే విధంగా, పర్యావరణ సేవలో నిబద్ధతతో ముందుకు నడుస్తున్న OEOL అడ్మిన్ శ్రీమతి లీలా కుమారి ఏలూరి గారి నాయకత్వాన్ని మరియు సర్వసభ్యుల సమిష్టి కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
……….******…….

06డిసెంబర్ 2025: ఈరోజు మాజీ మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారు, వారి సతీమణి గారు, కుమార్తె గారు మన ఆహ్వానాన్ని మన్నించి మన స్టాల్‌ను సందర్శించడం ఎంతో ఆనందకరమైన విషయం.
మన స్టాల్‌ను సందర్శించిన అనంతరం, వారు “మిద్దె తోటలపై మాత్రమే కాదు, పర్యావరణం కోసం మీరు చేస్తున్న అనేక మంచి కార్యక్రమాలు నిజంగా ప్రశంసనీయం” అని పేర్కొంటూ, పర్యావరణ సేవలో అంకితభావంతో ముందుకు నడుస్తున్న OEOL అడ్మిన్ శ్రీమతి లీలా కుమారి ఏలూరి గారి నాయకత్వాన్ని మరియు మొత్తం టీం కృషిని అభినందించారు.
Leave a comment