One Earth One Life

Nature_Gardeners_Prakruti_Odi_1st-Anniversary_11-Oct-2025

CategorIes:

By

·

5–7 minutes

అక్టోబర్ 11వ తేదీన నేచర్ గార్డెనర్స్(ప్రకృతి ఒడి) గ్రూపు యొక్క మొదటి వార్షికోత్సవ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. మేమెంతగానో ఎదురు చూసిన ముఖ్య అతిథులు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు మరియు ముఖ్య వక్తగా శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి. గారు,వారిద్దరి రాకతో ఎంతో ఘనంగా కార్యక్రమం జరిగింది. విశాఖపట్నం లోని గాజువాక వద్ద టి .ఎస్. ఆర్ టి .బి కే.కాలేజ్ నందు జరగిన కార్యక్రమానికి మా ఆహ్వానం మేరకు మరికొందరు విశాఖపట్నం అతిథులు మరియు గ్రూపు సభ్యులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని నేచర్ గార్డెనర్స్
మరియు రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మిద్దె తోటలు వండని వంటలు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి కొనిదెన శ్రీనివాస్ గారు మన ఆహ్వానం మేరకు విశాఖపట్నం కార్యక్రమానికి వచ్చారు. శ్రీనివాస్ గారు నేచర్ గార్డెన్స్ గ్రూపుకు ఆన్లైన్ క్లాసులు జూమ్ మీటింగ్ ద్వారా క్లాసులు చెప్తూ ఉంటారు.
మొదటగా శ్రీమతి అరుణ కుమారి గారి వినాయక స్మరణతో కార్యక్రమం ప్రారంభించాము. చిరంజీవి జ్ఞాపిక భరతనాట్యంతో వేదికకి కళ వచ్చింది. ఆ తర్వాత ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రకృతి పాఠాలు నేర్పిన గురువులు శ్రీ రఘోత్తమ రెడ్డి గారికి మరియు రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారికి సన్మానం చేయడం జరిగినది. రఘోత్తం రెడ్డి గారు మాట్లాడుతూ మిద్దెతోటల మీద ప్రచారం నేను మూడు సంవత్సరాల క్రితమే ఆపేశాను మిగతా ప్రచారకర్తలు చాలామంది ఉన్నారు కనుక.ఇది నూరవ మిద్దె తోట సదస్సు మాట్లాడాలి కాబట్టి కొంత సమయం కేటాయించాము అని చెప్పారు. మందులు లేకుండా మనం పండించుకునే కాయగూరలు వంట వండుకునే విధానంలోనే మనకి ఆరోగ్యాన్నిస్తుంది. వంటలను ఎక్కువగా ఉడికించి మసాలాలు జత చేసి మనం పండించిన పంటని విలువ లేకుండా చేసుకోవద్దు. వండని వంటల కార్యక్రమం మీ అందరికీ ప్రవేశపెట్టి మేము చెప్పేది కూడా అందుకోసమే. నూనె లేకుండా ఆరోగ్యానికి సరిపడా వంటలు ఎలా చేసుకోవాలి? మీ అందరికీ ప్రచారం చేయడం ముఖ్య ఉద్దేశం అని చెప్పారు.
రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ మేము మిద్దె తోట దారులను రైతులతో సమానంగా ప్రచారం చేయడానికి ముఖ్య కారణం ప్రస్తుత రోజుల్లో సిటీల్లో పచ్చదనం కనుమరుగైపోయింది పచ్చదనంతో పాటు మీ ఆరోగ్యానికి సరిపడా పంటలను పండించుకోవడం మహిళలు ఎంతో మందికి ముందుకు రావడం ప్రచారం ద్వారా మరింత మంది ఆర్గానిక్ పంటలను పండించుకోవడం ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు.
అంత బిజీ షెడ్యూల్ లో కూడా వారు సాగర్ నగర్ లో ఉంటున్న మణి గారి మిద్దెతోటను సందర్శించటం జరిగింది. అంత ప్రయాణ బడలికలో కూడా మిద్దె తోటని సందర్శించడం వాళ్ళ గొప్పతనానికి నిర్వచనం .కార్యక్రమానికి వస్తూ అతిధులు పెద్దలిద్దరూ మా మిద్దె తోట ని సందర్శించటం వలన నా మొక్కలన్నిటికీ కిరీటం పెట్టినట్టుగా మరునాడు నిగ నిగలాడుతూ మెరుపులతో ఎంతో అందంగా నా మేడ మీద మొక్కలు కనపడటం నేను గమనించాను. వారి రాక మాతో సహా మా ఇంటి మొక్కలకు కూడా ఎంతో సంతోషాన్ని వేసింది వారిరువురికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు.🙏
సమయాభావం వల్ల నేను ఇంటి వద్ద ఉండడం కుదరలేదు,సమావేశం ఏర్పాట్లు చూసుకోవాలి, ఒక్కొక్కరు వస్తున్నారు వారిని పలకరించి కూర్చోబెట్టాలి కాబట్టి సార్ కి చెప్పాను. మా వారు దగ్గరుండి చూసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిఐ గారు మరియు ఎమ్మార్వో గారు మరియు లైన్స్ క్లబ్ వైస్ గవర్నర్ గారు,ప్రెసిడెంట్ గారు మరియు కొందరు పెద్దలు, కొందరు కార్పోరేటర్లు వచ్చారు. వారందరికీ చిరు సత్కారం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా సర్వీసు చేస్తున్న ఏరియా అడ్మిన్స్ అందర్నీ సన్మానించుకోవడం జరిగినది.వారందరూ ఎంత సంతోషపడ్డారు అంటే *మా జీవితంలో గురువులతో మాకు సన్మానం చేయించడం మర్చిపోలేనిది అని” వారు నాకు చెప్పడం చాలా తృప్తినిచ్చింది.
మనము ఒక గ్రూపుని నడుపుతున్నాము అంటే ఎప్పుడూ మనకే పేరు రావాలని కొందరి తాపత్రయం నేను చూశాను. మనతోపాటు మనకు సర్వీస్ చేసిన వారికి కూడా సమానమైన గౌరవం మనం ఇవ్వగలిగితే వారు కూడా ఎంతో ఉత్సాహంగా ఇంకా మంచిగా గ్రూపును ముందుకు తీసుకు వెళ్ళగలరు. వారందరి గురించి శ్రీమతి తలసిలా సుజాత గారు వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత మొక్కలు ఆర్థర్ పెట్టిన ప్రతి ఏరియాకి పంపించినప్పుడు మరియు ఏదైనా ఏరియా మీట్లు మరియు ఆర్గానిక్ మేళాలు గ్రూప్ ఆర్డర్లు యొక్క మొక్కలు విడదీయడానికి గాని మనం చెప్పగానే ఏ పని చెప్పినా సర్వీస్ చేసే వాలంటీర్లను సన్మానించుకోవడం జరిగింది. ఏరియాకి ఒకరిని ఎంచుకొని 12 మందికి సన్మానం చేయడం జరిగినది.
ఆ తర్వాత భోజనం సమయం అవుతున్నది కావున రఘోత్తమ రెడ్డి గారు రాజాం వెళ్ళవలసి ఉంది.సమయం తక్కువగా ఉండడం వల్ల వండని వంటల కార్యక్రమం ఓపెన్ ప్లేస్ లో,కాలేజీ పిల్లలకి ప్రకృతికి దగ్గరగా అప్పుడప్పుడు పాఠాలు చెప్పడానికి కాలేజీ వాళ్ళు ఏర్పాటు చేసిన రాతి బల్లల మీద వండని వంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ప్రతి ఏరియా నుంచి ఒక్కొక్కరు పాల్గొన్నారు. అందరూ చాలా మంచిగా కొత్త కొత్త వంటలను మాకు పరిచయం చేశారు ఇందులో వండని వంటల పుస్తకంలో లేనివి పంపించిన యెడల మేము పబ్లిష్ చేస్తాము అని రైతు నేస్తం చైర్మన్ శ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు అన్నారు. వండని వంటలను అతిథులు ఇద్దరూ ప్రతి ఒక్కరి వంటను రుచి చూడడం, వండని వంటల్లో పాల్గొన్న సభ్యుల ఆనందం మాటల్లో చెప్పరానిది. వారు ఇప్పటికీ మాకు కలగానే ఉన్నది అని మాకు చెప్పడం జరిగినది. శ్రీ రఘోత్తమరెడ్డి గారు మరియు రైతు నేస్తం చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు అందరి కోసం అంత సమయం కేటాయించడం నేను గమనించిన విషయం. రగోతమ రెడ్డి గారు రాజాం బయలుదేరారు. భోజనాల తర్వాత కొంతమంది పిల్లలు కాబోయే విద్య తోట రైతులు ప్రకృతి ప్రేమికులు రైతుల మీద ప్రత్యేకించి వారి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు జరిగిన ప్రతి పనిలోనూ ఈ పిల్లలందరూ వాలంటీర్లుగా వారి సర్వీసులు అందించడం వారి తల్లిదండ్రులు దగ్గరుండి వారికి అన్ని వివరించడం ముందు ముందు ఈ పిల్లలే ప్రకృతిని భూమిని ఆర్గానిక్ పంటలు పండించే మిద్దె తోట రైతులు గా కనిపించారు.ఈ పిల్లలందరికీ రైతు నేస్తం వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేయడం జరిగినది. వీరందరూ వారికి వీలైనప్పుడల్లా నిపుణులు అయిన వారి మిద్ది తోటలను సందర్శించి మెళుకువలను నేర్చుకుంటున్నారు. .వండని వంటలు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి రైతు నేస్తం చైర్మన్ శ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మొక్కలు,మేమంటోలు మరియు శాలువాలు అందజేయడం జరిగింది.అంత పెద్ద వారై ఉండి మేము పిలవంగానే డేటు ఇచ్చారు. నిజానికి జూన్ నెలలో మా మొదటి వార్షికోత్సవ దినోత్సవం జరగవలసినది. కొన్ని మా ఇంటి అనుకోని సంఘటన వలన డేటు మార్చుకోవాల్సి వచ్చినది. రైతు నేస్తం చైర్మన్ శ్రీ వెంకటేశ్వరరావు గారు అడగగానే ఆ విన్నపాన్ని మన్నించి వస్తానని అనడం చక చకా పనులు ప్రారంభించడం జరిగింది మేమందరం. వారు వచ్చి మాకు సపోర్ట్ చేసి సాధారణ మిద్దె తోట రైతు గృహిణులను,వారు చేసిన సర్వీసులకు స్వయంగా చిరు సత్కారం చేయడం వల్ల నేచర్ గార్డెనర్స్ గ్రూపు సభ్యుల అడ్మిన్స్ మరియు సర్వీస్ చేసే వాలంటీర్ బాధ్యతను మరింత పెంచినది.
ఈ కార్యక్రమంలో మేము 600 మందారం మొక్కలని ఉచితంగా పంచాము.అంతే కాకుండా కాయగూర నారులని,రేర్ విత్తనాలని కూడా పంచాము.
ఈ కార్యక్రమంలో గుడ్డ సంచులను మాత్రమే వాడాలి మరియు విత్తనములు కోసం స్టీల్ బాక్స్లను తెచ్చుకోవాలని ముందు నుంచి సభ్యులకు చెప్పడం వల్ల అందరూ గుడ్డ సంచులను మాత్రమే వాడారు. చాలామంది తమ తోటల నుండి తీసుకువచ్చిన విత్తనాలను సీడ్ బ్యాంకు కి అందించారు. కాయగూరల నార్లు తీసుకునేటప్పుడు మరియు విత్తనాలు తీసుకునేటప్పుడు ఎటువంటి గందరగోళం గురి కాకుండా చక్కగా లైన్ లో నుంచొని అందరు అందుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కొందరు కొమ్మలుమొక్కలు తీసుకొని అందరికీ పంచడం వల్ల వారిలో స్నేహభావం మరింత బలపడేలాగా కనిపించింది.
ఖమ్మం నుండి అతిథిగా వచ్చిన మిద్దెతోట ప్రచారకర్త శ్రీనివాస కొనిదన గారు మాట్లాడుతూ *మీరందరూ పిల్లల్ని కూడా ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ చేయడం చాలా బాగా నచ్చింది. పిల్లలందరూ విత్తనం యొక్క విలువ ఆర్గానిక్ పంటల గురించి తెలుసుకునే లాగా మిద్దె తోట పెంచాలి అనుకునే వారికి కార్యక్రమంలో పేదవారికి మరియు మిడిల్ క్లాస్ వారికి మరియు డబ్బు ఖర్చు పెట్టగలిగే వారికి మూడు రకాల మిద్దతోట నమూనా ఏర్పాటు చేసి అరుదైన మొక్కలను అందరికీ పరిచయం చేసిన నేచర్ గార్డెన్స్ గ్రూపు సభ్యులు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ముందు ముందు భావితరాలకు మనం అందించే కానుక” అని ఆయన మాట్లాడారు.
ఇంత బిజీ సమయంలో కూడా అతిధులు ఇరువురు మా మొదటి వార్షికోత్సవ పురస్కారాలకి రావడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇక మీద మరింత మందిని మెరుగైన మిద్దె తోట రైతులుగా తీర్చిదిద్దడానికి మా వంతు మేమంతా కృషి చేస్తామని పెద్దలకి తెలియజేస్తున్నాము🙏
ఈ కార్యక్రమానికి విజయనగరం మరియు అనకాపల్లి నుంచి సభ్యులు మరియు మిత్రులు మిద్దె తోట ప్రచారకర్తలు ఆదిలక్ష్మి గారు మరియు ఆశాలతగారు రావడం అతిథులను వారి గ్రూపు తరఫున చిరు సత్కారం చేయడం జరిగినది. ఉత్తరాంధ్ర జిల్లా అంతట ఒకే చోట కలవడం ప్రతి సంవత్సరం మూడు నాలుగు కార్యక్రమాలకి అందరూ కలిసి చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. మా స్నేహితులు విజయవాడ వాస్తవ్యులు వన్ ఎర్త్ వన్ లైఫ్ లీలా కుమారి గారు మరియు శ్యాం ప్రసాద్ గారు అనివార్య కారణాలవల్ల కార్యక్రమానికి రాలేకపోయారు. 500 ఎస్టర్ మొక్కలు మా గ్రూపు సభ్యులందరి కోసం .లీలా కుమారి గారు పంపించారు. నేచర్ గార్డినర్స్ గ్రూపు మొదటి వార్షికోత్సవ సంబరాలు చక్కగా చేసుకుంటున్నాం అంటే చాలామంది స్నేహితుల సహాయ సహకారాలు మాకు అందాయి. మా గ్రూపు కోసం విజయవాడ వారితో పాటు మాకు నారు మొక్కలు,సీజనల్ ప్లాంట్స్, చామంతి మొక్కలు ఇలాంటివన్నీ తెప్పించుకోవడం లో సహాయం చేసిన లీలా కుమారి గారికి, విత్తన దాత హ్యాపీ గార్డెన్స్ అప్పారావు గారు,వారి గ్రూప్ తో పాటు మాకు కూడా బల్బులు తెప్పించడం మరియు పళ్ళ మొక్కలు ఫ్రీగా పంచిపెట్టిన బృందావన్ హెల్పింగ్ హాండ్స్ వారిని పరిచయం చేసిన శ్రీకాకుళం వాస్తవ్యులు అను పెర్ల గారు మరియు ఆదిలక్ష్మి గారికి, కుటుంబ సభ్యులు లా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో అడ్మిన్స్ కొందరు మరియు సర్వీస్ చేసేవారు కొందరు కలిసి వాలంటరీగా స్పాన్సర్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.🌱🙏

Leave a comment