


🌍🌱 ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా
వన్ ఎర్త్ వన్ లైఫ్ (టెర్రస్ గార్డెన్ గ్రూప్) ఆధ్వర్యంలో వన్ టౌన్ కార్యాలయంలో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది.
గ్రూప్ అడ్మిన్స్ లీలా కుమారి ఏలూరి, శ్యాంప్రసాద్ పర్యవేక్షణలో సభ్యులు పాల్గొన్నారు.
లీలా కుమారి గారు – “పచ్చదనం పెంచితేనే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యం” అన్నారు.
శ్యాంప్రసాద్ గారు – “గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించే సరళ మార్గం మొక్కలు నాటడమే” అన్నారు.
విశాఖపట్నం నుంచి పర్యావరణ ప్రేమికురాలు ప్రియభాందవి విచ్చేసి “మొక్కలు మన ఆరోగ్యానికి, పర్యావరణానికి ఆధారం” అని సందేశమిచ్చారు.
కార్యక్రమంలో వన్ ఎర్త్ వన్ లైఫ్ టీం సభ్యులు మద్దిరాల కమలాకరరావు, లుధియ, రాజేశ్వరి, వసంత, అమీన్ తదితరులు పాల్గొన్నారు. 🌿
Leave a comment