One Earth One Life

White_Galijeru@Punarnava

CategorIes:

By

·

4–5 minutes
తెల్లగలిజేరు ఆకు

తెల్లగలిజేరు ఆకు..
వర్షం పడగానే ఎక్కడపడితే అక్కడ చక చకా మొలిచి కనిపించే మరో అద్భుతమైన మూలిక గలిజేరు . కొన్ని మూలికల గురించి చదువుతూంటే భగవంతుడు ఎంత దయామయుడు అనిపిస్తుంది . అత్యంత ప్రమాదకర అనారోగ్యాలకు వైద్యాన్ని , ఔషధాలను  అతి దగ్గరగా , సులువుగా , చవకగా  ఉంచినందుకు . ప్రకృతిని నాశనం చేస్తూన్న మనిషికి తనని తాను నాశనం చేసుకుంటున్నాడన్న స్పృహ ఎప్పుడు కలుగుతుందో అనిపిస్తుంది . ఆరోగ్యం లేని ధనం , జీవితం , ఆయుష్షు ఎవరికి, ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించుకోవాలి .
మన మొక్క విషయానికి వస్తే ,దీన్ని పునర్నవ అని కూడా అంటారు . ఆయుర్వేద మందుల్లో anti inflammatory గా , anti oedema (ఒంట్లో నీరు చేరటం ) ముందుగా వాడే పునర్నవాసవం , రక్తాన్ని వృద్ది పరచటానికి వాడే పునర్నవ మండూరం  తయారు చేసేది ఈ మొక్కతోనే .
వర్షాభూ అని కూడా అంటారు . వర్షా కాలం లో మొలిచేది కాబట్టి .ఇంగ్లీష్ లో boerhavia diffusa .నేల మీద పాకే  ఈ మొక్క మూడు రకాలు.తెలుపు , ఎరుపు , నలుపు. ఔషధ గుణాలు మూడింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు .వాటికి పూచే చిన్న చిన్న పువ్వుల రంగు బట్టి అది ఏ రంగుదో  నిర్ణయిస్తారు.
తెల్ల గలిజేరు వేడి చేసి , కఫము ,దగ్గు ,విషము ,హృద్రోగాలను ,పాండు రోగాలు , శరీరానికి కలిగే వాపులు , వాత వ్యాధులు , కడుపుకి సంబంధించిన వ్యాధుల్ని పోగొడుతుంది .  లివర్ వాపు ని , గుండె బలహీనత వల్ల వఛ్చిన వాపుని పోగొడుతుంది . కిడ్నీ లను బాగు చేసి సక్రమం గా పని చేసేలా చేస్తుంది .  బాగా ముదిరిన ఈ మొక్క వేరులను సేకరించి పాలు కాచేటప్పుడు వచ్చే ఆవిరి మీద ఉడికించి ఎండబెట్టి పొడి  చేసి  బెల్లం నెయ్యి కలిపి తీసుకుంటే మూల వ్యాధి , పాండు రోగము , శ్వాస సంబంధిత అనారోగ్యాలు, అరుచి , వాతము , కఫము , ఉబ్బు పోగొడుతుంది .
నెల  రోజులు తింటే కుష్ఠుని కూడా హరిస్తుందని వస్తు గుణ దీపిక చెప్తుంది . ఈ వేరు  నీటిలో అరగతీసి కంటికి పెడితే రేచీకటి  తొలగిపోయి , కంటి చూపు మెరుగు పడుతుంది . ఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి  చెందుతుంది . ఈ తెల్ల గలిజేరు ఆకు రసం పది గ్రాములు పెరుగులో కలిపి ఉదయం , సాయంకాలం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి . అలా మూడు రోజులు తినాలి  . 
ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి . గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానం గా నువ్వుల నూనె ని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి , వాతం నొప్పులున్న చోట , కీళ్ల  నెప్పులకు మర్దనా చేస్తే  తగ్గుతాయి . నడకరాని పిల్లలకు ఇదే తైలం మర్దన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని మూలికా వైద్యులు చెప్తారు . గలిజేరు ఆకు రసం తీసి సగం బరువు పటికబెల్లం పొడి కలిపి తీగ పాకం పట్టి చల్లార్చి ఉంచాలి . రోజు ఒక చెంచా పాకం గ్లాస్ నీళ్ళల్లో కలిపి తాగితే గుండె దడ , గుండె బలహీనత తగ్గుతాయంటారు
శరీరాన్ని detoxify చేయటానికి అద్భుతం గా ఉపయోగపడుతుంది . శరీరం లో యూరియా లెవెల్స్  ని తగ్గిస్తుంది . diuretic గా పని చేస్తుంది . గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోదకాలు తగ్గుతుంది .
ఎర్ర గలిజేరు చలవ చేసి పైవాటితో పాటు పిత్తాన్ని పోగొడుతుంది . నల్ల గలిజేరు కారం , చేదు రుచి ఉండి  వాతాన్ని పోగొడుతుంది . ఇది దొరకటం అరుదు. మనకి సామాన్యం గా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరె .
పప్పులో కలిపి వండుకుంటారు , ఉప్పు మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండి  లో గుమ్మడి బదులు  తరిగిన గలిజేరు మొక్క కలిపి వడియాలు గా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు . ఆకుల తో కషాయం  చేసి తాగుతారు . ఈ కషాయం లో కొద్దీ గా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది .
తెల్ల గలిజేరు వేరు , ఉమ్మెత వేరు కలిపి ముద్ద చేసి తింటే పిచ్చి కుక్క కరిచినప్పటి విషం విరిగిపోతుంది.
తెల్లగలిజేరు వేరు , నీరు , పాలు సమంగా కలిపి పాలు మిగిలే దాకా కాచి వడకట్టి తాగితే సర్వ జ్వరాలు హరిస్తాయని సుశ్రుత సంహిత చెప్తుంది .
ఈ ఆకు కూరని అతిగా తినకూడదు . తీవ్రమైన హృద్రోగం ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకుని తీరాలి .diabetes , అధిక రక్త పోటు ఉన్నవారు చలువ చేసే పదార్ధాలు అధికం గా తింటూ ఈ ఆకు కూరని మితం గా తినాలి . ఈ ఆకుతో చేసిన మందులు మాత్రం పై సమస్యలు ఉన్నవారు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే  వాడాలి .  lactating తల్లులు , గర్భిణీలు ఈ ఆకు కూర తినకూడదు. ఆరోగ్యం బాగున్న వారు ఈ కాలం లో వారానికి ఒక సారి తిన్నా సరిపోతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు పప్పులో వండుకుని తింటే మంచిది . చాలా త్వరగా కిడ్నీ ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది .  ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవితం చేయగలదు కాబట్టే ‘పునర్నవ’ అయ్యింది.

సేకరణ : డా సుజాత యనమదల

Google AI : తెల్ల గలిజేరు, తెలుగులో పునర్నవ అని కూడా పిలుస్తారు, ఇది ఒక ఔషధ మూలిక, ఇది ఆయుర్వేద వైద్యంలో మూత్రపిండాల ఆరోగ్యం, వాపు తగ్గించడం మరియు నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. దీనిని “శరీరాన్ని పునరుజ్జీవింపజేసేది” లేదా “శరీరానికి కొత్త జీవం పోసేది” అని అర్ధం. 

తెల్ల గలిజేరు యొక్క ఉపయోగాలు: 

  • మూత్రపిండాల ఆరోగ్యం:తెల్ల గలిజేరు మూత్ర విసర్జనను పెంచి, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది, అలాగే శరీరం నుండి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది. 
  • వాపు తగ్గించడం:ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది, ఇది కీళ్ళు, కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
  • నొప్పి నివారణ:తెల్ల గలిజేరు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 
  • కంటి ఆరోగ్యం:తెల్ల గలిజేరు కంటి చూపును మెరుగుపరుస్తుంది, కంటి వ్యాధులను తగ్గిస్తుంది మరియు కంటి నొప్పిని ఉపశమనం చేస్తుంది. 
  • యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు:ఇది శరీరంలోని విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది, అలాగే వివిధ వ్యాధులను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. 

తెల్ల గలిజేరు సాధారణంగా నేలమీద పాకే మొక్క, దీనికి గుండ్రని ఆకులు ఉంటాయి. తెల్ల గలిజేరును ఆయుర్వేద వైద్యంలో వివిధ రూపాల్లో ఉపయోగిస్తారు, వాటిలో పొడి, కషాయం, మరియు లేపనం ఉన్నాయి. 

Google AI: White galijeru , also known as punarnava in Telugu, is a medicinal herb used in Ayurvedic medicine for kidney health, reducing inflammation, and relieving pain. It means “that which rejuvenates the body” or “that which gives new life to the body”.  
Uses of white mustard:  
Kidney health:
White willow increases urination, improves kidney function, and helps remove excess water from the body.  
Reducing swelling:
It has powerful anti-inflammatory properties that help reduce joint and muscle pain and reduce the risk of chronic inflammatory diseases such as rheumatoid arthritis.  
Pain relief:
White willow bark also helps in reducing pain.  
Eye health:
White clover improves eyesight, reduces eye diseases, and relieves eye pain.  
Antioxidant and antibacterial properties:
It helps in removing toxins from the body, as well as helps in fighting bacteria that cause various diseases.  
White galijer is a plant that usually grows on the ground and has round leaves. White galijer is used in Ayurvedic medicine in various forms, including powder, decoction, and ointment.

Leave a comment