🌿 One Earth – One Life
మన సహజ సాగు ప్రయాణంలో మరో అందమైన క్షణం… 🌱
ఈ ఆదివారం సాయంత్రం జరిగిన
లిక్విడ్ బయో ఫర్టిలైజర్స్,
పెస్టిసైడ్స్,
పోటింగ్ మిక్స్
పంపిణీ కార్యక్రమం సంతోషంగా, సమర్థవంతంగా పూర్తైంది.
ఈ సందర్భంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
మీ ఆదరణ, సహకారం వల్లే ఈ కార్యక్రమం సౌభాగ్యవశాత్తూ సజావుగా సాగింది.
🙏 ప్రత్యేక కృతజ్ఞతలు –
మనసుతో, స్పందనతో, సమయపాలనతో ముందుగా వచ్చి సేవలందించిన వాలంటీర్లకు
వారి నిస్వార్థ సహకారంతో ఈ కార్యక్రమం మరింత సాఫీగా సాగింది.
📸 పై వీడియోలో ఆ క్షణాలను ఓసారి గుర్తు చేసుకుందాం…
మొక్కలతోనే కాదు… మనసులతోనూ పంచుకోవడం తెలిసిన మన OE-OL గార్డెన్ కుటుంబానికి
ఇది మరొక పండుగ క్షణం.
🌸 మన ప్రేమే పచ్చదనం – మన సహకారమే శక్తి! 🌿
OE-OL TEAM
*_🌿 పాత రోజుల Barter System…_* *_ఇప్పుడు మన One Earth – One Life సంప్రదాయం! 🌱_*
నిన్న సాయంత్రం జరిగిన బయో ఫెర్టిలైజర్స్ పంపిణీ కార్యక్రమం
ఒక చిన్న పచ్చదనోత్సవంలా మారింది.
విత్తనాలు, నార్లు, కట్టింగ్స్, పండ్ల మొక్కలు, పూల మొక్కలు…
ఒకరినొకరు ప్రేమగా పలకరిస్తూ,
ఇచ్చిపుచ్చుకున్న ఆ క్షణాల లోతు మాటల్లో చెప్పలేం.
అవి మన గ్రీన్ కుటుంబ బంధాన్ని మరింత బలపరిచాయి.
ఇలా సహజంగా పెరుగుతున్న ఈ పచ్చదన సంప్రదాయం
మన హృదయాల్లో పూలవలె వికసిస్తోంది.
… కమలాకర్
*🤝స్నేహబంధానికి, సహకారానికి, తెచ్చిన ప్రతి చిరునవ్వుకీ…*
*మనసారా 👏కృతజ్ఞతలు.*
*_🌸 ప్రేమగా పెంచుకుందాం… మనసుతో పంచుకుందాం! 🌿_*
Leave a comment